BJP Working president JP NAdda: మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు పరిణతి చెందిన ప్రజాస్వామ్యానికి నిదర్శనం: జేపీ నడ్డా

  • సీఎం ఫడ్నవీస్ కు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి
  • ఇక రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఖాయం
  • బీజేపీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు

మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఫడ్నవీస్ నాయకత్వంలో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. బీజేపీ అధికారంలోకి రావడమనేది పరిణతి చెందిన ప్రజాస్వామ్యానికి నిదర్శనం’ అని నడ్డా అన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఉత్కంఠగా రాజకీయ సమీకరణాలు మారాయి. శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ లు కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న సమయంలో ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ నేతృత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు తెలపడం తెలిసిందే. దీనితో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని గవర్నర్ కు తెలపడం, ఆయన అంగీకరిస్తూ ఫడ్నవీస్ తో ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ తో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

BJP Working president JP NAdda
greetings to Fadnavis
Maharashtra
  • Loading...

More Telugu News