KTR: ప్రమాదం జరిగిన సమయంలో కారు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది: కేటీఆర్

  • గచ్చిబౌలి ఫ్లైఓవర్ పైనుంచి కిందపడిన కారు
  • పాదచారి మృతి బాధాకరమన్న కేటీఆర్
  • ఫ్లైఓవర్ డిజైన్ లోపాలుంటే పరిశీలించి చర్యలు తీసుకుంటామని వెల్లడి

హైదరాబాద్ లోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి ఓ కారు కిందపడిపోయిన ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఫ్లైఓవర్ పై 40 కిలోమీటర్ల వేగం మించరాదని హెచ్చరిక బోర్డులు స్పష్టంగా పేర్కొంటున్నాయని, కానీ ప్రమాదం జరిగిన సమయంలో కారు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతోందని, అతివేగంతో అదుపుతప్పిందని తెలిపారు.

 ఏదేమైనా రోడ్డుపై వెళుతున్న ఓ పాదచారి దుర్మరణం పాలవడం విషాదకరం అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, ఫ్లైఓవర్ డిజైన్ లో ఏమైనా లోపాలున్నాయేమోనని పరిశీలిస్తామని వెల్లడించారు. కాగా, చీఫ్ ఇంజినీర్ల సూచన మేరకు ఫ్లైఓవర్ ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు కేటీఆర్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News