YCP MP Raghurama Krishnam Raju comments on BJP MP sujana Chowdhary: మా పార్టీ ఎంపీలెవరూ బీజేపీతో టచ్ లో లేరు: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు

  • నియోజకవర్గ సమస్యలతో ప్రధానిని కలిస్తే..బీజేపీతో టచ్ లో ఉన్నట్లా ?
  • సుజనా చౌదరే వైసీపీలోకి వచ్చే అవకాశముంది
  • ఏపీలో 25 ఏళ్లపాటు జగన్ పాలన కొనసాగుతుంది

వైసీపీ, ఇతర పార్టీల ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి స్పందించారు. తమ పార్టీ ఎంపీలెవరూ కూడా బీజేపీతో టచ్ లో లేరని తెలిపారు. రాష్ట్రంలో 25 ఏళ్ల పాటు జగన్ పాలన ఉంటుందన్నారు. సుజనా చౌదరే వైసీపీలోకి వచ్చే అవకాశముందన్నారు. తనతో టచ్ లో ఉన్న వైసీపీ నేతలెవరో సుజనా చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ సమస్యలతో ప్రధానిని కలిస్తే..బీజేపీతో టచ్ లో ఉన్నట్లా? అని ఎంపీ ప్రశ్నించారు. సుజనా చౌదరి అబద్ధాలాడుతున్నారని పేర్కొన్నారు.

YCP MP Raghurama Krishnam Raju comments on BJP MP sujana Chowdhary
None YCP MPs in touch with BJP
  • Loading...

More Telugu News