Virat Kohli: కోహ్లీ సర్ ప్రైజ్... ఆఖరి వికెట్ కు ఇన్నింగ్స్ డిక్లేర్

  • తొలి ఇన్నింగ్స్ 347/9 వద్ద డిక్లేర్ చేసిన భారత్
  • టీమిండియా ఆధిక్యం 241 పరుగులు
  • కోహ్లీ సెంచరీ

కోల్ కతాలో జరుగుతున్న డేనైట్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విస్మయం కలిగించే నిర్ణయం తీసుకున్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరును 9 వికెట్లకు 347 పరుగుల వద్ద డిక్లేర్ చేశాడు. అప్పటికి భారత్ ఆధిక్యం 241 పరుగులు మాత్రమే. అయితే తన బౌలర్ల ప్రదర్శన పట్ల విశ్వాసం ఉంచిన కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేందుకు వెనుకాడలేదు. షమీ, ఉమేశ్, ఇషాంత్ లతో కూడిన టీమిండియా పేస్ దళాన్ని ఎదుర్కొని 200 పైచిలుకు పరుగులు చేయడం బంగ్లాకు తలకు మించిన పనే! ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 106 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.

కాగా, రెండో రోజు ఆట తొలి సెషన్ లో కోహ్లీ (136) సెంచరీ హైలైట్ అని చెప్పాలి. పింక్ బంతిని ఎదుర్కోవడం తొలిసారే అయినా ఎంతో పట్టుదల కనబర్చిన కోహ్లీ అద్భుతరీతిలో శతకం సాధించాడు. అంతకుముందే రహానే (51), జడేజా (12) కూడా వెనుదిరిగారు. బంగ్లా బౌలర్లలో అల్ అమీన్ 3, ఇబాదత్ 3, అబు జాయేద్ 2 వికెట్లు సాధించారు.

Virat Kohli
India
Bangladesh
Kolkata
Pink Ball
  • Loading...

More Telugu News