google Employes Agitation: యాజమాన్యం వైఖరికి నిరసనగా.. గూగుల్ కార్యాలయం ఎదుట ఉద్యోగుల ఆందోళన

  • ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగులను సెలవుపై పంపడంపై నిరసన
  • వారిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్
  • సుమారు 200మంది ఉద్యోగుల ఆందోళన

ప్రముఖ సెర్చింజన్ సంస్థ గూగుల్ కంపెనీ యాజమాన్యంపై అసంతృప్తితో ఉద్యోగులు నిరసనకు దిగారు. ఉద్యోగులను అణచివేస్తున్నారని ఆరోపించారు. తాజాగా ఇద్దరు ఉద్యోగులను సెలవుపై పంపడంపై సహచర ఉద్యోగులు శాన్ ఫ్రాన్సిస్కోలోని కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. సుమారు 200మంది ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇద్దరు ఉద్యోగులను సెలవుపై వెళ్లమనడం ఏమిటని ఉద్యోగులు గూగుల్ యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. వారిని తక్షణమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  ఈ నెల ప్రారంభంలో సదరు ఉద్యోగులు కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడంతో వారిని సెలవుపై పంపినట్లు గూగుల్ ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఓ మహిళా ఉద్యోగిని సంస్థలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని చెపుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని తెలిపినట్లు సమాచారం.

google Employes Agitation
sending Employees on long leave without notice issue
USA
sanfrasisco
  • Loading...

More Telugu News