Dharmana Krishnadas: జగన్ ఇన్ని మంచి పనులు చేస్తున్నా చప్పట్లు కొట్టరా?: మంత్రి ధర్మాన అసహనం

  • జగన్ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు
  • ఇంత చేస్తున్న సీఎం పట్ల కృతజ్ఞత ఉండాలా? వద్దా?
  • ఒక నిజాయతీపరుడికి కావాల్సింది మీ హర్షధ్వానాలే కదా

బిస్కెట్ వేస్తే కుక్క, కొంచెం గడ్డి వేస్తే పశువులు ఎంతో విశ్వాసంగా ఉంటాయని ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కానీ, ముఖ్యమంత్రి జగన్ ఎన్నో మంచి పనులు చేస్తున్నా... చప్పట్లు కొట్టడం లేదంటూ నిరుద్యోగులను ఉద్దేశించి మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఒక నిజాయతీపరుడికి కావాల్సింది మీ చప్పట్లు, మీ హర్షధ్వానాలే కదా? అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సచివాలయ, గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలను ఇచ్చామని... ఇంత చేస్తున్న సీఎం పట్ల కృతజ్ఞత ఉండాలా? వద్దా? అని ప్రశ్నించారు. నరసన్నపేటలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో నిరుద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈవ్యాఖ్యలు చేశారు.

Dharmana Krishnadas
YSRCP
Jagan
  • Loading...

More Telugu News