Maharashtra CM Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు శుభాకాంక్షలు తెలిపిన పురంధేశ్వరి

  • సుపరిపాలన కోసమే రాష్ట్ర ప్రజలు బీజేపీకి అత్యధిక సీట్లను కట్టబెట్టారు
  • బీజేపీకి శివసేన నమ్మకద్రోహం చేసింది
  • ప్రజల నమ్మకాన్ని ఫడ్నవీస్ నిలబెడతారు

మహారాష్ట్రలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో సుపరిపాలన కోసమే బీజేపీకి అత్యధిక సీట్లను ప్రజలు కట్టబెట్టారని ఆమె పేర్కొన్నారు. శివసేన బీజేపీని మోసం చేసిందన్నారు. బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమై విపక్షాలతో జతకట్టిందన్నారు. ప్రజల నమ్మకాన్ని ఫడ్నవీస్ నిలబెడతారని ఆమె ఆకాంక్షించారు.  

Maharashtra CM Devendra Fadnavis
purandeshwari Greetings
  • Loading...

More Telugu News