BJP: బీజేపీ ఇప్పుడు కొత్త ఆట మొదలు పెట్టింది: ఉద్ధవ్ థాకరే

  • ప్రజా తీర్పును అవమానించారని మాపై ఆరోపణలు వస్తున్నాయి
  • బీజేపీ ప్రయత్నాలన్నింటినీ తిప్పికొడతాం
  • వెన్నుపోటు పొడవాలనుకున్న వారితో ఛత్రపతి ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసు 
  • బీజేపీ ఇంతకు ముందు ఈవీఎంలతోనూ ఆడుకుంది

ప్రజా తీర్పును అవమానించారని మాపై బీజేపీ ఆరోపణలు చేస్తోందని, కానీ బీజేపీయే ప్రజలను మోసం చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే అన్నారు. పాక్ పై జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ తరహాలో మహారాష్ట్ర ప్రజలపై మెరుపుదాడి చేశారని, ప్రజలే బీజేపీపై ప్రతీకారం తీర్చుకుంటారని వ్యాఖ్యానించారు.

'శివసేన ఎమ్మెల్యేల్లో కూడా చీలిక తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తోందా? ప్రయత్నించనివ్వండి.. మహారాష్ట్ర ప్రజలు హాయిగా నిద్రపోకుండా చేస్తోందా? చేసుకోనివ్వండి. వారి ప్రయత్నాలన్నింటినీ తిప్పికొడతాం. అప్పట్లో తనను వెన్నుపోటు పొడవాలని చూసిన వారితో ఛత్రపతి శివాజీ ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసు. ఇంతకు ముందు బీజేపీ ఈవీఎంలతో ఆట ఆడింది. ఇప్పుడు కొత్త ఆట మొదలు పెట్టింది' అని ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు.

BJP
uddhav thakre
shiv sena
  • Loading...

More Telugu News