Maharashtra: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై దర్శకుడు హరీశ్ శంకర్ ట్వీట్

  • అనేక మలుపులు తిరిగిన మరాఠా రాజకీయాలు
  • ట్విట్టర్ లో స్పందించిన టాలీవుడ్ దర్శకుడు
  • అప్పట్లో శరద్ పవార్ కాంగ్రెస్ ను చీల్చారని వెల్లడి

టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ విపరీతంగా మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయాలపై స్పందించారు. అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చి బీజేపీకి మద్దతివ్వడంపై ట్వీట్ చేశారు. శరద్ పవార్ 1978లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించారని, ఆ మరుసటి రోజే పార్టీని చీల్చి ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడమే కాకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారని వెల్లడించారు. ఇప్పుడు అజిత్ పవార్ రూపంలో అదే అనుభవం ఆయనకు ఎదురైందని, అజిత్ పవార్ వెంట 30 మంది ఎన్సీపీ శాసనసభ్యులు ఉన్నట్టు తెలుస్తోందని హరీశ్ శంకర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Maharashtra
BJP
Congress
NCP
Shivsena
Sharad Pawar
Ajit Pawar
  • Error fetching data: Network response was not ok

More Telugu News