sharad pawar: అజిత్ పవార్ కు షాక్ ఇచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. రాజ్ భవన్ వరకు వెళ్లి తిరిగి శరద్ పవార్ వద్దకు వచ్చేసిన వైనం

  • వివరాలు తెలిపిన  ఎన్సీపీ ఎమ్మెల్యే రాజేంద్ర షింగానె 
  • అజిత్ పవార్ నాకు ఫోన్ చేసి ఓ విషయంపై చర్చించాలన్నారు
  • రాజ్ భవన్ వెళ్లాను... అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతోంది
  • నేను వెంటనే తిరిగి శరద్ పవార్ వద్దకు వెళ్లిపోయాను

ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా అజిత్ పవార్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేల్లో కొందరు ఆయనకు షాక్ ఇచ్చారు. ముగ్గురు ఎమ్మెల్యేలు తిరిగి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వద్దకు చేరుకున్నారు. ఏదో పని ఉందంటూ అజిత్ పవార్ ఫోన్ చేశారని, దీంతో తాము రాజ్ భవన్ కు వెళ్లామని చెప్పారు. తమకు అంతకు మించి ఏమీ తెలియదని వివరించారు.

రాజ్ భవన్ కు వెళ్లి మళ్లీ వచ్చేసిన ఎన్సీపీ ఎమ్మెల్యే రాజేంద్ర షింగానె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. 'అజిత్ పవార్ నాకు ఫోన్ చేసి ఓ విషయంపై చర్చించాలని పిలిచారు. దాంతో రాజ్ భవన్ కు వెళ్లాను. అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతోంది. దీంతో నేను వెంటనే తిరిగి శరద్ పవార్ వద్దకు వెళ్లిపోయాను. నేను శరద్ పవార్ తోనే ఆయనకు మద్దతుగా ఉంటానని చెప్పాను. అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుందన్న విషయం కూడా మాకు తెలియదు' అని వ్యాఖ్యానించారు.

sharad pawar
ncp
BJP
  • Loading...

More Telugu News