Viyayasai Reddy: ప్రపంచస్థాయి మాల్ ను నగర నడిబొడ్డులో కాకుండా మీ బొడ్డులో నిర్మిస్తారా?: విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న ఫైర్

  • ఏపీలో తప్ప ఏ రాష్ట్రంలోనైనా పెట్టుబడులు పెడతామని కంపెనీలు అంటున్నా సిగ్గు రావడం లేదా?
  • మీ సూట్ కేస్ కంపెనీలకు ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారు
  • మళ్లీ కోర్టు బోనులో నిలబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

ఏపీకి లూలూ కంపెనీ గుడ్ బై చెప్పిన నేపథ్యంలో వైసీపీ రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. లూలూకు కేటాయించిన భూముల వ్యవహారంలో అవినీతి జరిగిందని, త్వరలోనే అది బయటపడుతుందని మంగళవారం మాటలు ఎందుకు మాట్లాడుతారని విమర్శించారు. మీ అపర మేధావితనానికి తన జోహార్లని, అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిన మీరు ఇలా మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. బైబై ఏపీ అన్న లూలూ సంస్థకు... తెలంగాణ వెల్ కమ్ అందని అన్నారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.

ఏపీలో తప్ప మిగిలిన ఏ రాష్ట్రంలోనైనా పెట్టుబడులు పెడతామని కంపెనీలు అంటున్నా మీకు సిగ్గు రావడం లేదా విజయసాయిరెడ్డిగారు? అంటూ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ప్రపంచ స్థాయి మాల్ ను నగరం నడిబొడ్డున కాకుండా... మీ బొడ్డులో లేదా మీ ఇంటి దొడ్డిలో లేదా జనసంచారం లేని మీ జగన్ గారి ఇడుపులపాయ ఎస్టేట్ లో నిర్మిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు.

ప్రభుత్వ భూములను మీ సూట్ కేస్ కంపెనీలకు కారుచౌకగా మీ జగన్ గారు, మీరు అమ్మేస్తున్నారని విజయసాయిపై బుద్ధా వెంకన్న మండిపడ్డారు. కొత్త కేసుల్లో త్వరలోనే మీరు కోర్టు బోనులో నిలబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.

Viyayasai Reddy
Budda Venkanna
Jagan
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News