Narendra Modi: ఫడ్నవిస్, అజిత్ పవార్ లకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ

  • మహారాష్ట్రలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ
  • సీఎంగా ఫడ్నవిస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం
  • ఇద్దరూ కలిసి గొప్ప పాలన అందిస్తారనే నమ్మకం ఉందన్న మోదీ

శరవేగంగా, ఊహించని విధంగా మారిన పరిణామాల మధ్య మహారాష్ట్రలో బీజేపీ మరోసారి అధికారాన్ని చేపట్టింది. ఎన్సీపీని నిట్టనిలువునా చీల్చిన అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ప్రకటించారు. వెనువెంటనే రాష్ట్రపతి పాలనను ఎత్తివేయడం జరిగిపోయింది. ఏం జరుగుతోందో అర్థమయ్యే లోపలే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ తో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ప్రమాణస్వీకారం చేయించారు.

మరోవైపు సీఎం, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేసిన ఫడ్నవిస్, అజిత్ పవార్ లకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'ఫడ్నవిస్, అజిత్ పవార్ కు శుభాకాంక్షలు. మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ఇద్దరూ కలిసి సుపరిపాలన అందిస్తారనే నమ్మకం నాకుంది' అని ట్వీట్ చేశారు.

Narendra Modi
Devendra Fadnavis
Ajit Pawar
BJP
Shivsena
NCP
  • Loading...

More Telugu News