Ajit Pawar: అజిత్ పవార్ మోసం చేశాడు: ఉద్ధవ్ థాకరేకు శరద్ పవార్ ఫోన్

  • ఉద్ధవ్ కు రెండు సార్లు ఫోన్ చేసిన శరద్ పవార్
  • అజిత్ పవార్ ద్రోహానికి ఒడిగట్టారని వ్యాఖ్య
  • కాసేపట్లో భేటీ కానున్న ఇరువురు నేతలు

ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ మద్దతుతో మహారాష్ట్రలో ఎట్టకేలకు బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ పరిణామంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఊహించని విధంగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరడం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లకు మింగుడుపడటం లేదు.

ఈ పరిణామాల నేపథ్యంలో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ రెండు సార్లు ఫోన్ చేశారు. అజిత్ పవార్ తమను మోసం చేశారని, ద్రోహానికి ఒడిగట్టారని ఉద్ధవ్ కు వివరించారు. కాసేపట్లో ఉద్ధవ్, శరద్ పవార్ భేటీ కానున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు.

Ajit Pawar
Sharad Pawar
NCP
BJP
Shivsena
Uddhav Thackeray
  • Loading...

More Telugu News