Sanjay Raut: రాత్రి 9 గంటల వరకు అజిత్ పవార్ మా పక్కనే కూర్చున్నారు... చివరకు వెన్నుపోటు పొడిచారు!: శివసేన

  • అజిత్ పవార్ మోసం చేశారు
  • ఛత్రపతి శివాజీ, మహారాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరు
  • ఇందులో శరద్ పవార్ తప్పిదం లేదు

ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న వేళ... ఊహించని విధంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో శివసేన షాక్ కు గురైంది.

ఇది చాలా దారుణమని శివసేన కీలక నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. అజిత్ పవార్ శివసేనకే కాకుండా, యావత్ మహారాష్ట్రకు వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. అజిత్ పవార్ చేసినదాన్ని ఛత్రపతి శివాజీ, మహారాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు. నిన్న రాత్రి 9 గంటల వరకు అజిత్ పవార్ తమ పక్కనే కూర్చున్నారని... ఆ తర్వాత మాయమయ్యారని చెప్పారు. ఈ అంశంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తప్పిందం ఏమీ లేదని అన్నారు. శదర్ పవార్ ను కూడా అజిత్ పవార్ మోసం చేశారని సంజయ్ రౌత్ అన్నారు.

తమ అధినేత ఉద్ధవ్ థాకరేతో శరద్ పవార్ టచ్ లో ఉన్నారని సంజయ్ రౌత్ చెప్పారు. ఈరోజు వీరిద్దరూ భేటీ కానున్నారని తెలిపారు. ఇద్దరూ కలిసిన సంయుక్తంగా మీడియా సమావేశాన్ని కూడా నిర్వహిస్తారని చెప్పారు.

Sanjay Raut
Shivsena
BJP
NCP
Ajit Pawar
Sharad Pawar
  • Loading...

More Telugu News