Kadapa District: ఇసుక అక్రమ రవాణాలో తొలి శిక్ష.. కడప జిల్లా వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష

  • జులై 15న పాపాగ్ని నది నుంచి ఇసుక అక్రమ రవాణా
  • గోపరాజుపల్లెకు చెందిన వ్యక్తిని దోషిగా తేల్చిన కోర్టు
  • జైలు శిక్షతోపాటు రూ. 10 వేల జరిమానా

ఇసుక అక్రమ రవాణా కేసులో ఏపీలో తొలి శిక్ష అమలైంది. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గోపరాజుపల్లెకు చెందిన వ్యక్తికి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించింది. జులై 15న ఎస్సై భక్తవత్సలం గ్రామ సమీపంలోని పాపాగ్ని నది నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్‌లో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నాడు. ఈ కేసులో గోపరాజుపల్లెకే చెందిన నిందితుడు నంద్యాల సుబ్బారాయుడిపై కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన రెండో అదనపు జిల్లా మెజిస్ట్రేట్ నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

Kadapa District
sand
court
  • Loading...

More Telugu News