Helecopter: అత్తారింటికి హెలికాప్టర్ లో నూతన వధువు

  • రాజస్థాన్ లో ఓ తండ్రి వినూత్న ప్రయోగం
  • స్వాగతం తెలపడానికి తరలివచ్చిన గ్రామ ప్రజలు
  • పొంగిపోయిన అత్త, మామ

వివాహ వేడుక ముగిసిన తర్వాత నూతన వధువును వరుడి ఇంటికి పంపేందుకు వధువు తండ్రి వినూత్న ప్రయోగం చేశాడు. ఏకంగా హెలికాప్టర్ లో తన కూతురును, అల్లుడిని అత్తారింటికి పంపాడు. రాజస్థాన్ లోని ఝన్ ఝన్ జిల్లాకు చెందిన మహేంద్ర సోలాఖ్ తన కుమార్తెను హెలికాప్టర్ లో పంపడానికి ఏడాదికి ముందే నిర్ణయం చేశాడు. రెండు నెలలముందే వరుడి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిపాడు. కాగా, వరుని గ్రామంలో హెలికాప్టర్ దిగడంతో ప్రజలు తండోపతండాలుగా వచ్చి, వధూవరులకు స్వాగతం పలికారు. దాంతో వరుడి తల్లిదండ్రుల ఆనందానికి అంతేలేకపోయింది.

Helecopter
Bride arrived at father in Law house
  • Error fetching data: Network response was not ok

More Telugu News