India: గల్లా ఎఫెక్ట్... కొత్త మ్యాప్ లో ఏపీ రాజధానికి చోటు

  • ఇటీవలే పొలిటికల్ మ్యాప్ విడుదల చేసిన కేంద్రం
  • కనిపించని అమరావతి
  • గట్టిగా నిలదీసిన గల్లా జయదేవ్
  • తప్పు దిద్దుకున్న కేంద్రం

ఇటీవల కేంద్రం భారతదేశ పొలిటికల్ మ్యాప్ విడుదల చేయగా అందులో ఏపీ రాజధాని అమరావతి లేకపోవడం విమర్శలకు దారితీసింది. దీనిపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంటులో గట్టిగా నిలదీశారు. ఇది ఏపీకే కాకుండా ప్రధాని మోదీకి కూడా అవమానమేనని అన్నారు. గల్లా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించడంతో కేంద్రం తప్పు దిద్దుకుంది. కొత్త మ్యాప్ ను సవరించి అందులో ఏపీ రాజధాని అమరావతికి స్థానం కల్పించింది. ఈ మేరకు సర్వే ఆఫ్ ఇండియా విభాగం నూతన మ్యాప్ ను తీసుకువచ్చింది. దాంట్లో ఏపీ రాజధానిగా అమరావతిని చూడొచ్చు.

India
Political Map
Galla Jaydev
Andhra Pradesh
Amaravathi
  • Loading...

More Telugu News