India: కోల్ కతా టెస్టులో కోహ్లీ, పుజారా అర్ధ సెంచరీలు

  • టీమిండియా స్కోరు 43 ఓవర్లలో 3 వికెట్లకు 164 రన్స్
  • 55 పరుగులు చేసి పుజారా అవుట్
  • స్వల్ప స్కోర్లకే వెనుదిరిగిన మయాంక్, రోహిత్

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగుతున్న డేనైట్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వన్ డౌన్ బ్యాట్స్ మన్ చటేశ్వర్ పుజారా అర్ధ సెంచరీలతో రాణించారు. 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో పుజారా, కోహ్లీ జోడీ బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. అయితే పుజారా 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పేలవంగా ఆడి అవుటయ్యాడు.

ప్రస్తుతం కోహ్లీ 56 పరుగులతో ఆడుతుండగా, రహానే 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 43 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 14 పరుగులకే అవుటై నిరాశకు గురిచేయగా, రోహిత్ శర్మ పోరాటానికి 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తెరపడింది. అంతకుముందు, టీమిండియా బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 106 పరుగులకే ఆలౌటైంది. ఇషాంత్ శర్మకు 5 వికెట్లు దక్కాయి.

India
Bangladesh
Cricket
Kolkata
Virat Kohli
Cheteshwar Pujara
  • Loading...

More Telugu News