Congress: బతికినంతకాలం కాంగ్రెస్ లోనే ఉంటా: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్

  • పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
  • బలహీనవర్గాల అనుకూల నినాదాలతో కాంగ్రెస్ ఇప్పటివరకు బతికింది 
  •  నాడు ఏన్టీఆర్ కు వ్యతిరేకంగా యాత్రచేస్తే సోనియా అభినందించారు

తాను జీవించినంతకాలం కాంగ్రెస్ పార్టీని వదలి పెట్టనని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను పీసీసీ అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్నట్లు తెలిపారు. బీసీలకే ఈ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బతికినంత కాలం పార్టీకి విధేయుడిగానే ఉంటానని చెప్పారు.

‘1972 లో ఇందిరాగాంధీ బలహీన వర్గాలకు న్యాయం అన్న నినాదాన్ని తీసుకున్నారు. భూములు పంచడం, బ్యాంకులు జాతీయం చేయడం, రుణాలను ఇవ్వడం జరిగింది. బలహీనవర్గాల అనుకూల నినాదాలతో కాంగ్రెస్ ఇప్పటివరకు బతికింది. 1989లో బలహీనవర్గాల ర్యాలీ నిర్వహించి నేను వరంగల్ లో భారీ సభ నిర్వహించాను. నాడు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా యాత్ర చేస్తే, కొంత మంది వ్యతిరేకించారు. అయితే. సోనియాగాంధీ అభినందించారు’ అని అన్నారు.

  • Loading...

More Telugu News