Congress Senior leader V.Hanmantha Rao: ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలకు పీసీసీ అధ్యక్షుడి పదవి ఇవ్వాలి: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్

  • తెలంగాణ ఇచ్చిన సోనియాకు రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చి కృతజ్ఞత తెలుపుతాం
  • అధికారంలోకి తేవడానికి వయసు ముఖ్యం కాదు.. అనుభవం ప్రధానం
  • తనకు ప్రజల్లో గుర్తింపు ఉందన్న వీహెచ్ 

ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా ప్రకారం బీసీలకు పీసీసీ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఇందిరా గాంధీ తరహాలోనే సోనియా గాంధీ కూడా బలహీనవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నానని చెప్పారు. అగ్ర కులాల ఆలోచన, వైఖరుల్లో మార్పులు రావాలని చెప్పారు. ఈ రోజు వీహెచ్ మీడియాతో మాట్లాడారు. తనకు ప్రజల్లో మంచి పేరు ఉందని, అవకాశమివ్వాలని అన్నారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చి కానుక ఇవ్వాలని పేర్కొన్నారు. పార్టీని అధికారంలోకి తేవడానికి వయసు ప్రధానం కాదని, అనుభవం ముఖ్యమని చెప్పారు. 82 ఏళ్ల షీలా దీక్షిత్ కు ఢిల్లీ పీసీసీ పదవి ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు పొన్నాల లక్ష్మయ్యకు పీసీసీ అధ్యక్షుడిగా అవకాశమిస్తే.. 21 సీట్లు వచ్చాయన్నారు. బీసీల హయాంలోనే కాంగ్రెస్ కు మేలు జరిగిందన్నారు. డీఎస్ హయాంలో కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందన్నారు.

Congress Senior leader V.Hanmantha Rao
Telangana
Expecting PCC Chief post
  • Loading...

More Telugu News