High Cout Green Signal: తెలంగాణలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- మోటార్ వెహికల్ ఆక్ట్ 102 ప్రకారం రూట్ల ప్రైవేటీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది
- ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు
- కేబినెట్ నిర్ణయాలపై జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ
తెలంగాణలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన రిట్ పిటిషన్ ను కొట్టివేసింది. రాష్ట్రంలో 5,100 రూట్లను ప్రైవేటీకరణ చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య వాదనలు నడిచాయి. అనంతరం కోర్టు తీర్పును వెలువరిస్తూ.. మోటార్ వెహికల్ ఆక్ట్ 1988, 102 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి రూట్ల ప్రైవేటీకరణ చేసే హక్కు ఉందని కోర్టు తెలిపింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వానికి విశేష అధికారాలున్నాయని..కేబినెట్ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.