Jagan: మత్స్యకార భరోసా అందనివారు బాధపడాల్సిన అవసరంలేదు: సీఎం జగన్
- మత్స్యకార భరోసా పథకంపై సమీక్ష
- అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్న సీఎం
- ఇది నిరంతర ప్రక్రియ అని వెల్లడి
ఏపీ సీఎం జగన్ ఇవాళ మత్స్యకారులను ఆదుకునేందుకు ఉద్దేశించిన మత్స్యకార భరోసా పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ సచివాలయాల్లో లబ్దిదారుల జాబితాలు ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకార భరోసా పథకం కింద నగదు అందని వారు బాధపడాల్సిన పనిలేదని, అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని స్పష్టం చేశారు. కొత్తగా ఎంపికైన లబ్దిదారులకు భరోసా అందుతుందని వివరించారు. మత్స్యకార భరోసా కింద ప్రతి శుక్రవారం కొత్త లబ్దిదారులకు నగదు విడుదల చేస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం జగన్ ఉద్ఘాటించారు.