Andhra Pradesh: ఏపీ రాజధానిపై వైసీపీ ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలి: నారా లోకేశ్

  • అమరావతిని రాజధానిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఒప్పుకున్నారు
  • అధికారంలోకి రాగానే మాట మారుస్తున్నారు
  • రాజధానికోసం స్వచ్ఛందంగా భుములిచ్చిన రైతుల నమ్మకాన్ని వంచిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకున్నారని, అయితే అధికారంలోకి వచ్చాక మాటమారుస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. మంగళగిరిలో మాజీ మంత్రి ఎమ్.ఎస్.ఎస్ కోటేశ్వరరావు వర్ధంతి కార్యక్రమానికి హాజరయిన లోకేశ్ ఆయన విగ్రహానికి పూలమాలవేసి అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఏపీకి రాజధాని లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజధానికోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతుల నమ్మకాన్ని వైసీపీ ప్రభుత్వం వంచించిందని మండిపడ్డారు. రాష్ట్రంలోని పరిశ్రమలను సీఎం జగన్ పొమ్మంటే, తెలంగాణ రమ్మంటోందని అన్నారు. రాజధానిపై సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

Andhra Pradesh
capital
Amaravathi
Telugudesam leader Nara Lokesh Comment
Demanding clarification on continue of Amaravathi as state capital
  • Loading...

More Telugu News