Sujana Chowdary: ఈసారి సుజనా చౌదరి ఇలా ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది: విజయసాయిరెడ్డి

  • బ్యాంకు అధికారులతో సుజనా సమావేశం పెట్టాలి
  • పార్టీ ఎందుకు మారాడో అప్పుడు అర్థమవుతోంది
  • సుజనాను జస్టిస్ చౌదరిగా చూపెట్టే ప్రయత్నాన్ని ఆంధ్రజ్యోతి చేస్తోంది

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి సుజనా చౌదరి వెరైటీగా ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందన్న విజయసాయి... విలేకరులను కాకుండా తాను వేల కోట్ల మేర ముంచేసిన అర డజను బ్యాంకుల అధికారులను ఎదుట కూర్చోబెట్టుకుని, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే... ఆయన పార్టీ ఎందుకు మారాడో, చంద్రబాబు ఆయనను ఎందుకు మార్చాడో అన్నీ అర్థమవుతాయని అన్నారు.

సుజనా వారి మాయా సామ్రాజ్యం మీద ఒకప్పుడు మొదటి పేజీ కథనాలతో ఆంధ్రజ్యోతి మోతెక్కించిందని... ఇప్పుడు ఆయనను జస్టిస్ చౌదరిగా చూపెట్టే ప్రయత్నం చేస్తోందని విజయసాయి విమర్శించారు. నిన్నటి ప్రెస్ మీట్ ను లైవ్ లో, లైవ్ స్ట్రీమింగ్ లో మోతెక్కించిందంటే... దానికి కారణం పబ్లిక్ ఇంటరెస్టా లేక పబ్లిక్ గా తెలిసిపోయిన ఇంటరెస్టా? అని ప్రశ్నించారు.

అవినీతి మీద చంద్రబాబు నాయుడు, ఆకలి మీద లోకేశ్ నాయుడు, ఇసుక అక్రమాల మీద అచ్చెం నాయుడు, మహిళా రక్షణ మీద చింతమనేని, సంస్కారం మీద దేవినేని ఉమా, స్పీకర్ పదవి ఔన్నత్యం మీద యనమల లెక్చర్ ఇస్తే ఎలా ఉంటుందో... బ్యాంకు లూటీల భజనా చౌదరి ఏపీ ప్రయోజనాలపై ప్రెస్ మీట్లు పెడితే కూడా అలాగే ఉంటుందంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

Sujana Chowdary
Vijayasai Reddy
BJP
YSRCP
  • Loading...

More Telugu News