Kodali Nani: బూతుల మంత్రి మాట్లాడినంత మాత్రాన చట్టం మారుతుందా?: వర్ల రామయ్య

  • తిరుమలకు వెళ్లినప్పుడు జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే
  • కొడాలి నాని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
  • కొడాలి నాని నోటికి జగన్ కళ్లెం వేయాలి

ఏపీ మంత్రి కొడాలి నానిని బూతుల మంత్రిగా వ్యాఖ్యానిస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిబంధనల ప్రకారం తిరుమల ఆలయంలోకి అడుగు పెట్టాలంటే ముఖ్యమంత్రి జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని చెప్పారు. చట్టాన్ని అతిక్రమించిన జగన్ పై ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. బూతుల మంత్రి కొడాలి నాని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బూతుల మంత్రి మాట్లాడినంత మాత్రాన చట్టం మారిపోతుందా? అని ప్రశ్నించారు. తిరుమలకు ఎప్పుడు వెళ్లినా డిక్లరేషన్ ఇస్తానని జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. డిక్లరేషన్ ఇవ్వనందుకు జగన్ క్షమాపణ చెప్పాలని అన్నారు. ఇదే సమయంలో, కొడాలి నాని నోటికి జగన్ కళ్లెం వేయాలని చెప్పారు.

Kodali Nani
Varla Ramaiah
Jagan
Telugudesam
YSRCP
Tirumala
  • Loading...

More Telugu News