Rajamouli: 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' సినిమా ట్రైలర్ పై రాజమౌళి స్పందన

- సినిమా ట్రైలర్ ను పోస్ట్ చేసిన రాజమౌళి
- నా కెరీర్ ప్రారంభం నుంచి శ్రీనివాస్ రెడ్డి కమెడియన్ గా తెలుసు
- దర్శకుడు, నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయనకు అభినందనలు
హాస్యనటుడిగా అలరించి మంచి పేరు తెచ్చుకున్న శ్రీనివాసరెడ్డి ఇప్పుడు దర్శకుడు, నిర్మాతగా మారి ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమా తీస్తున్నారు. శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో సత్య, షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో వరుణ్‌తేజ్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ ట్రైలర్ పై దర్శకుడు రాజమౌళి స్పందించారు. 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు సినిమా ట్రైలర్ ఇదిగో.. నా కెరీర్ ప్రారంభం నుంచి నాకు శ్రీనివాస్ రెడ్డి మంచి కమెడియన్ గా తెలుసు. దర్శకుడు, నిర్మాతగానూ ప్రయాణం మొదలుపెట్టిన ఆయనకు అభినందనలు తెలుపుతున్నాను' అని ట్వీట్ చేశారు.
