Shiv Sena: మహారాష్ట్ర ప్రజలు ఉద్ధవ్ థాకరేనే సీఎంగా కోరుకుంటున్నారు!: సంజయ్ రౌత్

  • శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేనే ముఖ్యమంత్రిగా ఉంటారు
  • రెండు రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది
  • మా నిర్ణయాన్ని రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు తెలుపుతాం

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శదర్ పవార్ తో జరిగిన చర్చల విషయంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. 'ముఖ్యమంత్రిగా మీ పేరును శరద్ పవార్ ప్రతిపాదించారా?' అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ.. 'అది వాస్తవం కాదు. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేనే ముఖ్యమంత్రిగా ఉండాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు' అని వ్యాఖ్యానించారు.  

శివసేనకు చెందిన నేతే మహారాష్ట్రకు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని సంజయ్ రౌత్ తెలిపారు. ఇకపై బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని, తాము తీసుకున్న నిర్ణయాన్ని రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు తెలుపుతామని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన ముగిసిపోతుందని తెలిపారు.

Shiv Sena
Sanjay Raut
Sharad Pawar
Maharashtra
  • Loading...

More Telugu News