Nityananda: బుధవారం కేసు... విదేశాలకు స్వామి నిత్యానంద పరార్!

  • అహ్మదాబాద్ ఆశ్రమంలో చిన్నారుల నిర్బంధం
  • ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు
  • ఆయన దేశం విడిచి వెళ్లారని గుజరాత్ పోలీసుల ప్రకటన

రెండు రోజుల క్రితం వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానందపై పోలీసు కేసు నమోదుకాగా, ఆయన విదేశాలకు పారిపోయారు. ఈ విషయాన్ని గుజరాత్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. నిత్యానంద దేశం విడిచి వెళ్లారని స్పష్టం చేశారు.

 కాగా, అహ్మదాబాద్ లో నిత్యానంద నిర్వహిస్తున్న యోగిని సర్వజ్ఞ పీఠంలో చిన్నారులను అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణలు రావడంతో, ఆయనపై బుధవారం నాడు పోలీసు కేసు నమోదైంది. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే నిత్యానంద పారిపోయారని పోలీసులు ప్రకటించడం గమనార్హం. కాగా, నిత్యానందపై గతంలోనూ పలుమార్లు ఆరోపణలు వచ్చాయి. ఓ ప్రముఖ దక్షిణాది హీరోయిన్ తో ఆయన రాసలీలలు గడిపిన వీడియో కొన్నేళ్ల క్రితం బయటకు వచ్చి సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. 

Nityananda
Police
Case
  • Loading...

More Telugu News