airtel: స్పెక్ట్రం చెల్లింపులపై రెండేళ్ల మారటోరియం.. ఊపిరి పీల్చుకున్న ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా

  • తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్‌టెల్, వొడాఫోన్
  • వేలకోట్ల రూపాయల స్పెక్ట్రం బకాయిలు
  • 2022-23 వరకు బేఫికర్

సంక్షోభంలో కూరుకుపోయి బయట పడలేక తిప్పలు పడుతున్న టెలికం దిగ్గజం కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు కేంద్రం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్పెక్ట్రం చెల్లింపులపై రెండేళ్ల మారటోరియం విధించింది. దేశంలోని మేజర్ టెలికం ఆపరేటర్లు అయిన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ప్రభుత్వానికి రూ.42,000 కోట్లకు పైగా స్ప్రెక్ట్రం రుసుము చెల్లించాల్సి ఉంది. ఈ మూడు కంపెనీల్లో జియో లాభాల్లో ఉండగా, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఉద్దీపన ప్రకటించాలని ఇటీవల కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. స్పెక్ట్రం చెల్లింపులపై మారటోరియంతోపాటు వాయిదాలను పెంచాలని కోరాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం స్పెక్ట్రం చెల్లింపులపై రెండేళ్లపాటు మారటోరియం విధించింది. దీంతో ప్రస్తుతం ఎటువంటి స్పెక్ట్రం ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. 2020-23 ఆర్థిక సంవత్సరంలో స్పెక్ట్రం బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, జూలై-సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి వొడాఫోన్ ఐడియా రూ.51,000 కోట్ల నష్టాల్లో ఉండగా,  ఎయిర్‌టెల్ రూ.23,000 కోట్ల నష్టాల్లో ఉంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News