Hyderabad metro: హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. మైండ్‌స్పేస్ వరకు మెట్రో

  • ఈ నెల 29 నుంచి అందుబాటులోకి మైండ్‌స్పేస్ జంక్షన్
  • ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్, పువ్వాడ
  • కారిడార్-3లో 28 కిలోమీటర్ల దూరం వరకు మెట్రో సేవలు

హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు ఇది శుభవార్తే. ప్రస్తుతం హైటెక్ సిటీ వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండగా, ఈ నెల 29 నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ వరకు అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా మెట్రో కారిడార్-3లో నాగోల్ నుంచి మైండ్ స్పేస్ వరకు మొత్తం 28 కిలోమీటర్ల దూరం మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చినట్టు అవుతుంది. ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి మెట్రో సేవలు ప్రారంభమైతే వేలాది మంది ఐటీ ఉద్యోగులకు ఊరట లభిస్తుంది.

ప్రస్తుతం హైటెక్ సిటీ, రాయదుర్గం చెరువు మెట్రో స్టేషన్ల నుంచి ఐటీ ఉద్యోగులు షటిల్ సర్వీసుల ద్వారా కంపెనీలకు చేరుకుంటున్నారు. ఇప్పుడు మైండ్‌స్పేస్ జంక్షన్ స్టేషన్ అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ఈ నెల 29న మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్‌లు మైండ్‌స్పేస్ స్టేషన్ వరకు రైలును ప్రారంభిస్తారు.

Hyderabad metro
mindspace
IT Employees
  • Loading...

More Telugu News