kakinada: కాకినాడ సమీపంలో బోల్తాపడిన ఆర్టీసీ బస్సు.. 25 మంది గాయాలు

  • తిమ్మాపురం-అచ్చంపేట క్రాస్‌రోడ్డు వద్ద ఘటన
  • లారీ ఢీకొట్టడంతో బోల్తాపడి ముందుకు దూసుకెళ్లిన బస్సు
  • పరారీలో లారీ డ్రైవర్

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. జిల్లాలోని రాజోలు డిపోకు చెందిన బస్సు మలికిపురం నుంచి విశాఖపట్టణం బయలుదేరింది. బస్సు తిమ్మాపురం-అచ్చంపేట క్రాస్‌రోడ్డుకు చేరుకోగానే కాకినాడ నుంచి సత్తుపల్లి వెళ్తున్న లారీ వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తాపడి 50 మీటర్ల వరకు ముందుకు దూసుకుపోయింది.

ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను కాకినాడ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

kakinada
apsrtc bus
Road Accident
  • Loading...

More Telugu News