Nagababu: నా అంతట నేనే జబర్దస్త్ నుంచి బయటికి వస్తానని ఏమాత్రం ఊహించలేదు: నాగబాబు

  • జబర్దస్త్ నుంచి బయటికొచ్చిన నాగబాబు  
  • బిజినెస్ పరంగా కొన్ని విభేదాలున్నాయని వెల్లడి
  • ఎవర్నీ తప్పుబట్టడంలేదని స్పష్టీకరణ

మెగాబ్రదర్ నాగబాబు లేని జబర్దస్త్ ను ఊహించుకోవడం చాలా కష్టం. ఈ కామెడీ ఎంటర్టయిన్ మెంట్ కార్యక్రమంపై ఆయన వేసిన ముద్ర అలాంటిది. గత కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ తో ప్రస్థానం కొనసాగిస్తున్న నాగబాబు తన జర్నీకి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నానని, శుక్రవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ తనకు చివరిదని వెల్లడించారు.

2013 నుంచి జబర్దస్త్ తో తన ప్రయాణం మొదలైందని, కానీ తనంతట తానే జబర్దస్త్ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని ఊహించలేదని పేర్కొన్నారు. ప్రోగ్రామ్ బిజినెస్ కు సంబంధించిన కొన్ని భేదాభిప్రాయాల వల్ల బయటికి వచ్చేస్తున్నానని, ఇందులో ఎవరినీ తప్పుబట్టడంలేదని స్పష్టం చేశారు. ఆర్థికంగా ఎంతో పతనమైన స్థితిలో జబర్దస్త్ లోకి వచ్చానని, ఈ కార్యక్రమం కోసం తానందుకున్న పారితోషికం ఎంతో ఉపయోగపడిందని వెల్లడించారు. పారితోషికం విషయంలో తేడా వచ్చి జబర్దస్త్ నుంచి బయటికి వస్తున్నాననడం సరికాదని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని తన యూట్యూబ్ చానల్ ద్వారా వివరించారు.

Nagababu
Jabardasth
Andhra Pradesh
Telangana
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News