Hyderabad resident Prashant: ప్రశాంత్ ను భారత్ కు రప్పించడానికి సమయం పడుతుంది: విదేశాంగ శాఖ

  • ప్రశాంత్ పాక్ లో అక్రమంగా ఉంటున్నాడని అక్కడి పోలీసులు కేసు పెట్టారు
  • పొరపాటున పాకిస్థాన్ లో ప్రవేశించాడు
  • సురక్షితంగా అప్పగించాలని విజ్ఞప్తి చేశాం

పాకిస్థాన్ లో చిక్కుకున్న హైదరాబాద్ వాసి ప్రశాంత్ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసినట్లు సమాచారం.  2016-17లో పొరపాటున ప్రశాంత్ పాకిస్థాన్ లో అడుగుపెట్టాడని, అక్రమంగా పాకిస్తాన్ లో ఉంటున్నాడని అభియోగం నమోదైందని పేర్కొంది.

ప్రశాంత్ ను సురక్షితంగా అప్పగించాలని విజ్ఞప్తి చేశామని తెలిపింది. అతన్ని భారత్ కు రప్పించేందుకు సమయం పడుతుందని విదేశాంగ శాఖ పేర్కొంది. కాగా, ప్రశాంత్, మధ్యప్రదేశ్ కు చెందిన మరో వ్యక్తి రాజస్థాన్ లోని థార్ ఎడారికి ఆనుకుని ఉన్న పాక్ ఎడారి ఖోలిస్థాన్ లో పాకిస్థాన్ పోలీసులకు పట్టుబడ్డారు. ప్రశాంత్ కనిపించడం లేదంటూ 2017 ఏప్రిల్ 29న హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రశాంత్ తండ్రి బాబూరావు ఫిర్యాదు చేశారు.

Hyderabad resident Prashant
captured by Pakisthan police
India foreign Ministry announcement
  • Loading...

More Telugu News