Polavaram Project: పోలవరం ప్రాజెక్టు తక్కువ ధరకే నిర్మిస్తుంటే విమర్శిస్తారా?: ఏపీ మంత్రి బుగ్గన

  • టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలు సబబు కాదు
  • మీ హయాంలో కాంట్రాక్ట్ కు ఎక్కువ ధర నిర్ణయించారు
  • జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ లో తక్కువ ధరకే కాంట్రాక్ట్ ఖరారు చేసింది

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చేస్తోన్న విమర్శలపై  ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రకరకాలుగా మార్పులు చేసి విమర్శలకు దిగడం సబబుకాదన్నారు.

'మీ హయాంలో పోలవరం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ కు మీరిచ్చిన ధరకంటే సుమారు రూ.700 కోట్ల తక్కువ ధరకు జగన్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దీనిపై మీరు సంతోషపడాలి' అని మంత్రి పేర్కొన్నారు. కాళేశ్వరం కన్నా తక్కువ ధరకు తాము నిర్మాణ పనులను అప్పగించడంపై మీకు ఎందుకంత అసహనమని ఆయన ప్రశ్నించారు. 'రివర్స్ టెండరింగ్ ద్వారా డబ్బు ఆదా అయితే మంచిది కాదా? మా ప్రభుత్వం పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ లో కాంట్రాక్ట్ ఇచ్చాము' అన్నారు మంత్రి.

Polavaram Project
AP Finance minister Buggana Rajendhra Prasad
comments against Chandrababu and Telugudesam leaders
Andhra Pradesh
  • Loading...

More Telugu News