AP Govt Agreement with Ahmadabad IIM: అవినీతి నిర్మూలనకు అహ్మదాబాద్ ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

  • కేసుల విచారణలో సాంకేతిక సహకారం అందించనున్న ఐఐఎం
  • సీఎం సమక్షంలో సంతకాలు చేసిన ఐఐఎం ప్రొ.నారాయణస్వామి, ఏసీబీ చీఫ్ విశ్వజిత్
  • వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పణ

అవినీతి నిర్మూలన విషయంలో తాము కట్టుబడి ఉన్నామని వైసీపీ ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. రాష్ట్రంలో అవినీతిని రూపుమాపడానికి, కేసుల విచారణలో సాంకేతిక సహకారం తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ ఐఐఎంతో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

ఈ రోజు సీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఐఐఎం(ఎ) ప్రొఫెసర్ నారాయణస్వామి, ఏసీబీ చీఫ్ విశ్వజిత్ ఒప్పంద పత్రాలపై సీఎం జగన్ సమక్షంలో సంతకాలు చేశారు. ఐఐఎం బృందం వచ్చే ఏడాది ఫిభ్రవరి మూడో వారం వరకు ఈ అంశంపై అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేయనుందని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో సీఎస్ నీలం సహాని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News