Nara Lokesh: 'బైబై బాబు' పాటతో ఓటర్లను తప్పుదారి పట్టించినందుకు ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది: నారా లోకేశ్

  • ఏపీ నుంచి నిష్క్రమిస్తున్న లులూ గ్రూప్
  • ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్
  • ఇతర రాష్ట్రాలు నవ్వుకుంటున్నాయని వ్యాఖ్యలు

గల్ఫ్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహించే లులూ గ్రూప్ ఏపీ నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో నారా లోకేశ్ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదారి పట్టించి ఓట్లేయించుకునేందుకు 'బైబై బాబు' అనే పాటను తీసుకువచ్చారని, దాన్నిండా అబద్ధపు మాటలు, దొంగ హామీలేనని విమర్శించారు. ఆ విధంగా వంచించి ప్రజలతో ఓట్లేయించుకున్నందుకు ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ఆరోపించారు. 'బైబై ఏపీ' అని పాడుకుంటూ కంపెనీలు ఒకదాని వెంబడి మరొకటి రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని వివరించారు. ఇతర రాష్ట్రాలు మాత్రం చిద్విలాసంగా చూస్తున్నాయని ఎద్దేవా చేశారు.

Nara Lokesh
Jagan
Andhra Pradesh
Lulu Group
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News