Jagan: వేదికపైకి పిలిచి ధర్మాడి సత్యానికి శాలువా కప్పిన సీఎం జగన్

  • గోదావరిలో రాయల్ వశిష్ట బోటు మునక
  • అత్యంత శ్రమతో వెలికితీసిన ధర్మాడి సత్యం బృందం
  • అభినందించిన సీఎం జగన్

కొన్నినెలల క్రితం గోదావరిలో రాయల్ వశిష్ట బోటు మునిగిపోవడం ఏపీ చరిత్రలో మాయనిమచ్చలా మిగిలిపోయింది. అయితే, ఆ బోటును ఎంతో వ్యయప్రయాసల కోర్చి వెలికితీసిన ధర్మాడి సత్యం బృందంపై ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా, ధర్మాడి సత్యాన్ని ఏపీ సీఎం జగన్ సన్మానించారు. ఇవాళ ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ధర్మాడి సత్యం తన బృందంతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ధర్మాడి సత్యాన్ని వేదికపైకి పిలిచిన సీఎం జగన్ ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. గోదావరి నుంచి బోటును వెలికితీసినందుకు అభినందనలు తెలియజేశారు. ధర్మాడి బృందంలోని సభ్యులను కూడా ఆయన అభినందించారు.  

Jagan
YSRCP
Andhra Pradesh
Dharmadi Sathyam
Boat
Godavari
East Godavari District
  • Error fetching data: Network response was not ok

More Telugu News