Srisailam: శ్రీశైలం డ్యామ్ సురక్షితం... ఎలాంటి ముప్పులేదు: ఎస్ఈ వెల్లడి

  • శ్రీశైలం ప్రాజెక్టుకు పెనుముప్పు ఉందన్న వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్
  • డ్యామ్ భద్రతకు ఎలాంటి ఢోకాలేదన్న సూపరింటిండెంట్ ఇంజినీరు
  • సీడబ్ల్యూసీ సంతృప్తి వ్యక్తం చేసిందని వెల్లడి

శ్రీశైలం ప్రాజెక్టుకు పెనుముప్పు పొంచి ఉందని, డ్యామ్ కు ప్రమాదం వాటిల్లితే ఏపీలో సగభాగం కనిపించకుండా పోతుందని 'వాటర్ మ్యాన్' రాజేంద్రసింగ్ హెచ్చరించడం తెలిసిందే. దీనిపై శ్రీశైలం ప్రాజెక్టు సూపరింటిండెంట్ ఇంజినీరు చంద్రశేఖర్ రావు స్పందించారు. శ్రీశైలం డ్యామ్ భద్రతకు వచ్చిన ప్రమాదమేమీ లేదని, ప్రాజెక్టు ఎంతో సురక్షితం అని స్పష్టం చేశారు. త్వరలోనే డ్యామ్ తాజా పరిస్థితిపై ప్లంజ్ పూల్ సర్వే నివేదికలు వస్తాయని, వాటిని డ్యామ్ సేఫ్టీ కమిటీకి సమర్పిస్తామని వెల్లడించారు. రిజర్వాయర్ భద్రతపై ఇప్పటికే సీడబ్ల్యూసీ కూడా సంతృప్తి వ్యక్తం చేసిందని తెలిపారు.

Srisailam
Dam
Andhra Pradesh
Telangana
Kurnool District
Waterman Rajendra Singh
  • Loading...

More Telugu News