Adire Abhi: నాగబాబుగారి గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు: 'జబర్దస్త్' అదిరే అభి

  • మా మధ్య మనస్పర్థలు లేవు 
  •  మేము వర్గాలుగా ఏర్పడలేదు 
  • మార్పు అనేది సహజమన్న అభి

'జబర్దస్త్' కామెడీ షో ఎంతగా పాప్యులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అనసూయ .. రష్మీతో పాటు చాలామంది కమెడియన్స్ ఈ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చాలామంది ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు. అలాంటి ఈ షో గురించిన వార్తలే కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారాయి. 'జబర్దస్త్' నుంచి నాగబాబుతో పాటు కొంతమంది టీమ్ లీడర్స్ బయటికి వెళ్లిపోయారనీ, అందుకు ఫలానా కారణాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

ఈ విషయాన్ని గురించి 'అదిరే అభి' మాట్లాడుతూ .. "మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. ఇక్కడి నటులు వర్గాలుగా ఏర్పడినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదు. దర్శకులు .. నటులు మారుతుండటమనేది సహజంగా జరిగేదే. నేను ఎక్కడికీ వెళ్లడం లేదు .. హైపర్ ఆది వెళతాడని అనుకోవడం లేదు. మేము వెళ్లినా 'జబర్దస్త్' అనేది ఆగదు. ఇక నాగబాబుగారు బయటికి వెళ్లడం గురించి నేను స్పందించలేను. అది ఆయన స్వవిషయం .. ఆయన గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు" అని చెప్పుకొచ్చాడు.

Adire Abhi
Nagababu
  • Loading...

More Telugu News