Allu Arjun: ముద్దుల తనయకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్

  • నేడు మూడో పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లు అర్హ
  • ట్వీట్ చేసిన బన్నీ
  • లిటిల్ ఏంజెల్ అంటూ మురిపెం

టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కుమార్తె అర్హకు బర్త్ డే విషెస్ తెలియజేశాడు. నా చిన్నారి దేవత అల్లు అర్హకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు. నేడు అర్హ మూడో పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా బన్నీ తన కుమార్తెకు సంబంధించి ఓ పిక్ ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అందులో అర్హ చిరునవ్వులు ఒలికిస్తూ రంగురంగుల బెలూన్లు, ఇతర టాయ్స్ నడుమ సెలబ్రేషన్ మూడ్ లో కనిపిస్తోంది. కాగా, గతేడాది అర్హ పుట్టినరోజు వేడుకలను బన్నీ, స్నేహారెడ్డి దంపతులు గోవాలో జరుపుకున్నారు.

Allu Arjun
Allu Arha
Tollywood
Birthday
  • Loading...

More Telugu News