PAY TM: పేటీఎం నుంచి 'కేవైసీ' మెసేజ్ వచ్చిందా?... దయచేసి నమ్మవద్దంటూ సీఈఓ అర్జంట్ మెసేజ్!

  • పేటీఎం పేరిట నకిలీ సందేశం
  • యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సమాచారం
  • మోసగాళ్ల మాయలో పడవద్దన్న విజయ్ శేఖర్ శర్మ

తమ పేటీఎం సంస్థ పేరిట ఓ నకిలీ సందేశం వస్తోందని, కొన్ని లక్షల మందికి ఇది చేరిందని, దయచేసి దీన్ని నమ్మవద్దని సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఓ అత్యవసర సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇది ఓ కేవైసీ స్కామ్ అని, దీన్ని నమ్మరాదని అన్నారు. కేవైసీ వివరాలను వెంటనే అందించి, కింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోకుంటే, ఖాతా నిలిచిపోతుందన్న సమాచారం కొన్ని లక్షల మందికి వెళ్లడంతో, ఈ వ్యవహారంపై స్పందించిన విజయ్ శేఖర్, కస్టమర్లను అలర్ట్ చేశారు.

పేటీఎం ఎన్నడూ ఇటువంటి వివరాలను అడగబోదని ఆయన స్పష్టం చేశారు. ఏ విధమైన యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవాలని కూడా తాము సూచించబోమని తెలిపారు. బహుమతుల మాయలో పడవద్దని సూచించారు. ఖాతా వివరాలను హ్యాక్ చేసేందుకు మోసగాళ్లు చేస్తున్న పని ఇదని, దీనిపై తాము ఇప్పటికే ఫిర్యాదు చేశామని అన్నారు.

PAY TM
KYC
Mesage
Vijay Sekhar Sharma
Fruadlent
  • Loading...

More Telugu News