Amaravathi: అమరావతి అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తనున్న టీడీపీ

  • రాజసభలో జీరో అవర్ నోటీసును ఇచ్చిన టీడీపీ
  • వెంకయ్యకు నోటీసు ఇచ్చిన కనకమేడల
  • లోక్ సభలో ఈ అంశాన్ని ప్రస్తావించనున్న గల్లా జయదేవ్

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఆగిపోయిన అంశాన్ని తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో లేవనెత్తబోతోంది. పార్లమెంటు ఉభయసభల్లో ఈ అంశాన్ని ప్రస్తావించనుంది. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ దీనికి సంబంధించి జీరో అవర్ నోటీసును ఛైర్మన్ వెంకయ్యనాయుడికి అందజేశారు. మరోవైపు, ఇదే అంశాన్ని లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించనున్నారు.

అమరావతిపై ఏపీలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. రాజధానిని ఇతర ప్రాంతానికి తరలిస్తామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే, ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఇంత వరకు స్పందించలేదు.

Amaravathi
Telugudesam
Lok Sabha
Rajya Sabha
Kanakamedala
Galla Jayadev
  • Loading...

More Telugu News