Devineni Avinash: వైసీపీలో చేరడానికి కారణం ఇదే: దేవినేని అవినాశ్

  • జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ఆకట్టుకున్నాయి
  • జగన్ పై నమ్మకంతోనే వైసీపీలో చేరాను
  • వైసీపీ బలోపేతం కోసం పనిచేస్తా

ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని... ఆయనపై ఉన్న నమ్మకంతోనే వైసీపీలో చేరానని దేవినేని అవినాశ్ తెలిపారు. తనకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించినందుకు జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజలను కలుపుకుని ముందుకు వెళ్తానని... స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తానని అన్నారు. వైసీపీ బలోపేతం కోసం పని చేస్తానని చెప్పారు.

Devineni Avinash
YSRCP
Jagan
  • Loading...

More Telugu News