Chaitu: 'మహాసముద్రం' కోసం చైతూను ఒప్పించిన సమంత
![](https://imgd.ap7am.com/thumbnail/tn-361905450107.jpg)
- అజయ్ భూపతి నుంచి 'మహా సముద్రం'
- శేఖర్ కమ్ముల సినిమాతో బిజీగా చైతూ
- త్వరలో సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
తెలుగులో ఆ మధ్య యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకున్న చిత్రాల్లో 'ఆర్ ఎక్స్ 100' ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమాతో దర్శకుడిగా అజయ్ భూపతి తన సత్తా చాటుకున్నాడు. అయితే ఈ సినిమా తరువాత ఆయన 'మహా సముద్రం' అనే టైటిల్ తో ఒక కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ కథను రవితేజతోను ..బెల్లంకొండ శ్రీనివాస్ తోను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నించాడుగానీ కుదరలేదు.
దాంతో ఆయన ఈ కథను చైతూకి వినిపించాడు. ఈ కథను ఆయనతో పాటు విన్న సమంత, తనకి బాగా నచ్చేసిందని చెప్పిందట. ఈ విషయంలో ఆలోచనలో పడిన చైతూతో, ఎలాంటి సందేహం అవసరం లేకుండా చేసేయమని అన్నట్టుగా సమాచారం. దాంతో చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల సినిమా చేస్తున్న చైతూ, త్వరలో అజయ్ భూపతితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు.