Jagan: దేవుని ఆశీస్సులతో ప్రతి హామీని బాధ్యతగా నెరవేరుస్తున్నాం: జగన్

  • మత్స్యకార భరోసా ద్వారా వేట నిషేధ సమయంలో పరిహారంగా రూ. 10 వేలను అందిస్తాం
  • ప్రమాదవశాత్తు మరణించే మత్స్యకారుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం 
  • డీజిల్ సబ్సిడీని రూ. 9కి పెంచుతున్నాం

ఇచ్చిన ప్రతి హామీని దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలతో బాధ్యతగా నెరవేరుస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మత్స్య దినోత్సవం సందర్భంగా వైయస్సార్ మత్స్యకార భరోసా ద్వారా వేట నిషేధ సమయంలో పరిహారంగా రూ. 10 వేలను అందిస్తామని తెలిపారు. డీజిల్ సబ్సిడీని రూ. 9కి పెంచుతున్నామని చెప్పారు. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించే మత్స్యకారుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారాన్ని అందిస్తామని తెలిపారు. మత్స్యకారుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Jagan
YSRCP
Fishermen
YSR Matsyakara Bharosa
  • Loading...

More Telugu News