50 రోజులు పూర్తి చేసుకున్న 'సైరా'
- అక్టోబర్ 2వ తేదీన వచ్చిన 'సైరా'
- వసూళ్ల విషయంలో కొత్త రికార్డులు
- సక్సెస్ కోసం కృషి చేసిన టీమ్
ఆయా ప్రాంతాల్లోని మెగా అభిమానులు అర్థ శతదినోత్సవ వేడుకలను జరపడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి జీవించిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. నిండుతనం కలిగిన సిద్ధమ్మ పాత్రలో నయనతార .. త్యాగమే జీవితంగా భావించిన లక్ష్మి పాత్రలో తమన్నా నటన ప్రేక్షకులను మెప్పించాయి. సంగీతం .. ఫొటోగ్రఫీ .. టేకింగ్ ఈ సినిమాను మరో మెట్టుపై నిలబెట్టాయి. ఇలా అన్ని శాఖలు కీలకమైన పాత్రను పోషించడమే ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.