Kaira Adwani: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కైరా అద్వానీ ముంగిట ఆఫర్ల జోరు 
  • కేరళలో మహేశ్ యాక్షన్ 
  • అమెజాన్ ప్రైమ్ లో నేటి నుంచి 'సైరా'

   *  తెలుగు సినిమాలలో కూడా నటిస్తున్న బాలీవుడ్ నటి కైరా అద్వానీ కెరీర్ 'కబీర్ సింగ్' విజయం తర్వాత మంచి ఊపందుకుంది. దీంతో అరడజను సినిమాలలో ఆఫర్లు దక్కించుకుంది. దీనికి తోడు ఇప్పుడు సుమారు ఆరు పెద్ద సంస్థల నుంచి ప్రచారకర్తగా అవకాశాలు వచ్చాయట. ఇందుకోసం భారీ పారితోషికాన్ని కూడా ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం.   
*  అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో మహేశ్ బాబు, ఫైటర్లపై భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు.
*  ఇటీవల విడుదలైన చిరంజీవి నటించిన 'సైరా' చిత్రం ఆయనకు పలు ప్రశంసలను తెచ్చిపెట్టిన విషయం విదితమే. కాగా, ఈ చిత్రం నేటి (నవంబర్ 21) నుంచి అమెజాన్ ప్రైమ్ లో హెచ్డీ ప్రింట్ తో వీక్షకులకు అందుబాటులో వుంటుంది.    

Kaira Adwani
Mahesh Babu
Anil Ravipudi
Chiranjeevi
  • Loading...

More Telugu News