TRS: నలభై ఏళ్లుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం దుర్వినియోగమవుతోంది: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

  • అనుమతులు లేకుండా అనధికారికంగా నిర్మించారు
  • ప్రభుత్వానికి ఆదాయ రూపంలో ఒక్క పైసా రావట్లేదు
  •  ప్రస్తుతం వున్న లీజ్ ఒప్పందాలను మార్చాలి

టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత నలభై ఏళ్లుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం దుర్వినియోగమవుతోందని, అధీకృత, అనధికార యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండా రక్షణ భూములను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

విలాసవంతమైన వివాహ ఫంక్షన్ హాళ్లు, విద్యా సంస్థలు, దాబాలు, షోరూంలు, గోడౌన్లు, వాణిజ్య భవనాలను అనధికారికంగా నిర్మించారని, తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయ రూపంలో ఒక్క పైసా కూడా రావడం లేదని అన్నారు. ప్రస్తుతం వున్న లీజ్ ఒప్పందాలను మార్చాలని కోరారు. సాధారణ ప్రజల సంక్షేమం కోసం స్కైవేలు, ఎక్స్ ప్రెస్ వేల నిర్మాణాల నిమిత్తం రక్షణ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని కోరారు.

TRS
Mp
kotta prabhaker reddy
contonment
  • Loading...

More Telugu News