Goa Film Festival -IIFI: రజనీకాంత్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం: అమితాబ్ బచ్చన్

  • ఇఫి స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న అమితాబ్, రజనీకాంత్
  • రజనీ నా కుటుంబంలో సభ్యుడన్న బచ్చన్
  • విజయాలకు కారణమైన అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటా

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను పొగడ్తలతో ముంచెత్తారు. రజనీకాంత్ తన కుటుంబంలో సభ్యుడని పేర్కొన్నారు.  గోవాలో భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏటా నిర్వహించే ఇంటర్నేషనల్  ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫి) స్వర్ణోత్సవాలు ఈ రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుక ప్రారంభ ఉత్సవాల్లో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ సహా సినీ స్టార్లు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.అమితాబ్, జవదేకర్, రజనీకాంత్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ.. రజనీకాంత్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేశారు. తామిద్దరం ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటామన్నారు. కొన్ని సార్లు సలహాలను అనుసరించకున్నప్పటికీ తమ మధ్య బంధం ఇలానే కొనసాగుతుందన్నారు. రజనీకాంత్ జీవితం అందరికి స్ఫూర్తి దాయకమన్నారు. తన విజయాలకు కారణమైన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతున్నాని చెప్పారు. కష్టాల్లో.. సుఖాల్లో అభిమానులు వెంటే ఉన్నారని పేర్కొన్నారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. వారి రుణం తీర్చుకోవాలనుకోవటం లేదని, వారి అభిమానం ఎప్పటికీ తన వెంటే ఉండాలనుకుంటున్నానని అన్నారు. ఈ చిత్రోత్సవాలు ఈ నెల 28 వరకు కొనసాగనున్నాయి.

Goa Film Festival -IIFI
bollywood super star Amithab Bachan
Tamil Super Star Rajani Kanth
Javadeker minister
  • Loading...

More Telugu News