Devineni Uma: మంత్రి కొడాలి అహంకారంతో నోటి కొచ్చినట్లు మాట్లాడుతున్నారు: టీడీపీ నేత దేవినేని ఉమ మండిపాటు

  • వైసీపీ మంత్రులు ముందు తెలుగు భాషను నేర్చుకోవాలి
  • రాజధాని అమరావతి నిర్మాణంపై సీఎం జగన్ ప్రకటన చేయాలి
  • గ్రామాల్లో వైసీపీ నేతలు మద్యం అమ్ముతున్నారు

టీడీపీ నేత దేవినేని ఉమా వైసీపీ నేతల వైఖరిని తూర్పారబట్టారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిటాల, కోడెలని అన్యాయంగా బలి తీసుకున్నారని విమర్శించారు. పల్నాడుకు ఎవరినీ వెళ్లకుండా చేస్తున్నారని అన్నారు. మంత్రి కొడాలి అహంకారంతో మాట్లాడుతున్నారని చెప్పారు. మంత్రి అన్న హోదాను మరచి నీచంగా వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ మంత్రులు ముందు తెలుగు భాషను నేర్చుకోవాలని సూచించారు.

రాజధాని అమరావతి నగరం నిర్మాణంపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరావతిని గొంతు పిసికి చంపారన్నారు. గ్రామాల్లో వైసీపీ నేతలు మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. కౌలు రైతులలో కూడా కులాలు చూసిన ఘనత జగన్ దేనన్నారు. సిమెంట్ కంపెనీల వద్ద రూ.2,500 కోట్లకు బేరం ఆడింది నిజం కాదా ? తొలి విడతగా వెయ్యి కోట్లు తీసుకోలేదా ? అని ప్రశ్నించారు.

Devineni Uma
Telugudesam Leader
comments On Kodali Nani
criticism against YSRCP Leaders
Andhra Pradesh
  • Loading...

More Telugu News